మొదటి పేజీ

వికీపీడియా నుండి

వికీపీడియా ఎవరైనా రాయదగిన ఒక స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వము. ఇది మామూలు వెబ్ సైట్ల వంటిది కాదు.
ఇక్కడ సమాచారాన్ని చూడటమే కాదు, ఉన్న సమాచారంలో అవసరమైన మార్పుచేర్పులు చెయ్యవచ్చు. ఇక్కడ లేని సమాచారాన్ని చేర్చవచ్చు కూడా.
ప్రస్తుతం తెలుగు వికీపీడియాలో 44,275 వ్యాసాలున్నాయి. పూర్తి గణాంకాలు చూడండి.
పరిచయం అన్వేషణ కూర్చడం ప్రశ్నలు సహాయము

విహరణ విశేష వ్యాసాలు అ–ఱ సూచీ

స్వాగతం
ఈ వారపు బొమ్మ
సురేఖ చిత్రంచిన కార్టూను

సురేఖ పేరుతో ప్రసిద్ధి చెందిన కార్టూనిస్టు అసలు పేరు మట్టెగుంట వెంకట అప్పారావు. ఇతని వ్యంగ్య చిత్రాలు చక్కగా పేరుకు తగ్గట్టుగా శుభ్రంగా ఉంటాయి. బొమ్మలోని మిగిలిన వివరాలకు, పాత్రలకు సరిగ్గా సరిపోయే నిష్పత్తి ఉంటుంది. ఇతని కార్టూన్లు, తెలుగులోని అన్ని ప్రముఖ వార/మాస పత్రికలల ప్రచురింబడినాయి.

ఫోటో సౌజన్యం: సురేఖ మరియు కప్పగంతు శివరామ ప్రసాదు
మార్గదర్శిని
ఆంధ్ర ప్రదేశ్
భాష మరియు సంస్కృతి
తెలుగు సినిమా
భారత దేశము మరియు ప్రపంచము
విజ్ఞానము మరియు సాంకేతికం
విశేష వ్యాసాలు
సహకారము
ఈ వారపు వ్యాసము


Eiffel Tower 20051010.jpg

ఈఫిల్ టవర్ లేదా ఐఫిల్ టవర్, ప్యారిస్ లో సీన్ నది పక్కన ఉన్న చాంప్ డి మార్స్ పై నిర్మించిన ఎత్తైన ఇనుప గోపురం. దీనిని రూపొందించిన ఇంజనీరు గుస్టావ్ ఈఫిల్ పేరు మీదుగా దీనికి "ఈఫిల్ టవర్" అని పేరు వచ్చింది. ఇది ప్యారిస్ లోనే ఎత్తైన భవనమే కాకుండా ప్రపంచంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలలో ఒకటి. 1889 లో దీనిని స్థాపించినప్పటి నుంచీ 200,000,000 మందికి పైగా దీన్ని సందర్శించారు. ఇది ప్రపంచంలోకెల్లా ఎక్కువమంది డబ్బులిచ్చి సందర్శించే స్థలంగా ప్రఖ్యాతి గాంచింది.

ఈ టవర్ లో వాడిన లోహాలు తుప్పు పట్టకుండా ఉండేందుకు ఏడు సంవత్సరాల కొకసారి 50 నుంచి 60 టన్నుల పెయింట్ ను వాడుతారు. భూమి మీద నుంచి చూసే వీక్షకుడికి ఇది సమదృష్టి కోసం మూడు రకాలైన రంగులను ఉపయోగిస్తారు, బాగా ముదురుగా ఉన్న రంగు క్రింద భాగంలోనూ, లేత రంగు టవర్ పైభాగం లోనూ వేస్తారు.

ఈ నిర్మాణం 1887 మరియు 1889 మధ్యలో ఫ్రెంచి విప్లవం వంద సంవత్సరాల పండుగను పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ప్రపంచ ప్రదర్శనకు ముఖ ద్వారంగా ఏర్పాటు చేయడం జరిగింది. అసలు ఈఫిల్ 1888వ సంవత్సరంలో బార్సిలోనా లో ఈ టవర్ ను నిర్మించాలనుకున్నాడు. కానీ బార్సిలోనా లోని దీనికి సంబంధించిన అధికారులు ఈ నిర్మాణం కొత్తగానూ, ఖర్చుతో కూడుకొన్న పని అనీ నగరం యొక్క డిజైన్ లో సరిపడదని చెప్పారు. తరువాత ఈఫిల్ ఆ నిర్మాణ పథకాన్ని ప్యారిస్ లోని ప్రపంచ ప్రదర్శన అధికారులకు సమర్పించాడు. తరువాత అక్కడే 1889 లో దీన్ని నిర్మించడం జరిగింది.

మొదట్లో ఈఫిల్ టవర్ ను 20 సంవత్సరాల వరకే ఉండేటట్లుగా ఒప్పందం కుదిరింది. (టవర్ ను రూపొందించే పోటీలో భాగంగా దాన్ని కూలగొట్టడం కూడా సులువుగా ఉండాలి అని ఒక నియమం కూడా ఉండేది.) దీన్ని ప్రకారం 1909లో కూల్చివేయాలి. కానీ అది కమ్యూనికేషన్ అవసరాలకు, మరియు మిలిటరీ అవసరాలకు బాగా ఉపయోగపడుతుండడంతో అనుమతి ఒప్పందం అయిపోయిన తరువాత కూడా విజయ చిహ్నంగా అలాగే ఉంచేయడం జరిగింది.

ఇంకా....పూర్తివ్యాసం పాతవి

మీకు తెలుసా?

వికీపీడియా లోని కొత్త వ్యాసాలనుండి

గౌతమ బుద్ధుడు
  • ... జాతక కథలు బుద్ధుని పూర్వ జన్మల గురించిన కథల సమాహారమనీ! (జాతక కథలు వ్యాసం)
  • .. మంగళంపల్లి బాలమురళీ కృష్ణ చిన్న వయసులేనే సంగీతంలో అనుపమాన ప్రతిభ కనబరిచాడనీ! ( బాలమేధావి వ్యాసం)
  • ... నాయనార్లు అనగా తమిళనాడులో నివసించిన గొప్ప శివభక్తులనీ! (నాయనార్లు వ్యాసం)
  • ... కలరిపయట్టు ప్రపంచంలోనే అత్యంత ప్రాచీనమైన యుద్ధక్రీడ గా అభివర్ణించబడుతుందనీ! (కలరిపయట్టు వ్యాసం)
  • ... సగటు భారతీయుల్లో దాదాపు సగం మందికిపైగా టీ సేవిస్తున్నారనీ! (తేనీరు వ్యాసం)
చరిత్రలో ఈ రోజు

జనవరి 11భారతీయ భాషలలో వికీపీడియా

సోదర ప్రాజెక్టులు:
మెటా-వికీ 
ప్రాజెక్టుల సమన్వయము 
కామన్స్ 
ఉమ్మడి వనరులు 
విక్షనరీ 
శబ్దకోశము 
వికీసోర్స్ 
మూలములు 
వికీబుక్స్ 
పాఠ్యపుస్తకములు 
వికీకోట్ 
వ్యాఖ్యలు 
ఈ విజ్ఞానసర్వస్వం గానీ, దీని సోదర ప్రాజెక్టులు గానీ మీకు ఉపయోగకరమనిపించినట్లయితే, దయచేసి సహాయము చెయ్యండి. మీ విరాళాలు ప్రాథమికంగా సర్వర్ సామగ్రి కొనుగోలు చేయుటకు ఉపయోగిస్తారు.
పేజీకి సంభందించిన లింకులు